Header Banner

రాజధానిపై విషం చిమ్మడమే జగన్ పని.. సాక్షిపై తుళ్లూరులో రైతులు, మహిళల భారీ నిరసన!

  Sat Jun 07, 2025 15:33        Politics

- అమరావతి పూర్తయితే ప్రజలు తనను పూచికపుల్లలా చూస్తారన్నదే జగన్ భయం
- జగన్ అవినీతి పత్రిక సాక్షి కథనాలపై తుళ్లూరులో రైతులు, మహిళల భారీ నిరసన
- తప్పుడు రాతలు రాస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్న సాక్షిపై ఫిర్యాదు.

5 ఏళ్లతన దుర్మార్గ పాలనతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసినా జగన్ కడుపుమంట చల్లారలేదా
రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులపై దాష్టీకం ప్రదర్శించి, పోలీసులతో వారిని హింసించినా.. తప్పుడుకేసులతో వేధించినా వైసీపీ అధినేతకు తృప్తి కలగలేదా2019కి ప్రతిపక్షనేత హోదాలో రాష్ట్ర రాజధానిగా అమరావతి ఎంపికను స్వాగతించి, రాజధానిని గుంటూరు – విజయవాడ మధ్యలోనే పెట్టాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి కంటే ఘోరంగా తయారుచేశాడు. ఎక్కడికక్కడ ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి 5 ఏళ్ల పాటు ఎవరూ అమరావతి గురించి మాట్లాడకుండా చేశాడు. తన కేబినెట్ లోని మంత్రులతో నిత్యం అమరావతిపై  విషప్రచారం చేయించాడు. ఎడారని. శ్మశానమని, పందులు తిరిగే ప్రాంతమని, ముంపునకు గురవుతుందని నానారకాలుగా విషం చిమ్మించాడు. ఇంత చేసినా అమరావతిపై జగన్ లో గూడుకట్టుకొని ఉన్న వ్యతిరేకత చల్లారలేదు.

 

ఇది కూడా చదవండి: ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరఫరా.. మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా తన రోతపత్రికలో రాజధానే లక్ష్యంగా తప్పుడు వార్తులు ప్రచురింపచేస్తూనే ఉన్నాడు. అమరావతిలో ఏం జరిగినా.. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేయాలని, జరిగే ప్రతి అభివృద్ధి పనిలో లేని తప్పులు వెదికి ఉన్నట్టు విచ్చలవిడి ప్రచారం చేయాలని ఇటీవలే సొంతపార్టీ నేతలకు, తన సాక్షి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఆ కోవలో భాగమే అవినీతి సాక్షిలో ప్రచురించిన తప్పుడు కథనాలు. ఎలాంటి ఆధారాలు లేకుండా... నిజానిజాలు తెలుసుకోకుండా, తనలోని అసూయ, ఈర్ష్యాద్వేషాలే ప్రామాణికంగా జగన్ తన పత్రికలో అమరావతిపై దుష్ప్ర్రచారానికి తెగబడ్డాడు. జగన్ తీరును.. సాక్షి పత్రిక తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నేడు అమరావతి రైతులు, మహిళలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రాజధానిలోని తుళ్లూరులో సాక్షి పత్రిక ప్రతులు దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు కృషి, మోదీ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తయితే తనకు.. తనపార్టీకి మనుగడ ఉండదని, ప్రజలు తనను పూచికపుల్లకంటే హీనంగా చూస్తారన్నదే జగన్ భయమని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అభూతకల్పనలు.. అసత్యాలు.. ఆధారాల్లేని కథనాలు వండివారుస్తున్న సాక్షి పత్రికపై, దాని యాజమాన్యంపై, ఎడిటోరియల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పీ.ఎస్ లో ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు మహిళలు ,రైతులు, ప్రజాసంఘాల నాయకులు ర్యాలీగా వెళ్లి సాక్షిపై ఫిర్యాదు చేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #jagan #AndhraPradesh #APpolitics #APNews #Establishment #SakshiNews #WrongNews #APPeoples #falseMagazines